Tarakaratna: ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న తారకరత్న… ఏ సినిమాకంటే?

Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న 20 సంవత్సరాల వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2002వసంవత్సరంలో ఈయన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఇందులో ఈయన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ఇలా హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.ఇక తారకరత్న కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి అందరిని భయపెట్టారు. నిజం చెప్పాలంటే ఈయనకు హీరోగా కన్నా విలన్ గానే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

ఈ విధంగా రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి సినిమాలో ఈయన శ్రీను అనే విలన్ పాత్రలో నటించారు.అతి భయంకరమైన ఈ పాత్రలో తారకరత్న ఎంతో అద్భుతంగా నటించారని ఈయన నటనకు గాను ఏకంగా నంది అవార్డు కూడా వరించింది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో ఈయన విలన్ పాత్రలో నటించారు.

Tarakaratna: అమరావతి సినిమాకు నంది అవార్డు…

ఇక తాజాగా 9 అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా తారకరత్న విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇలా తిరిగి సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న తారకరత్న ఉన్నఫలంగా గుండెపోటుకు గురై మరణించడం అభిమానులకు తీరని లోటుగా మారింది. ఇక ఈయన చివరిగా సారధి అనే సినిమాలో నటించారు. ఇదే తారకరత్న చివరి సినిమా.