Political News

Nara Lokesh: బావ అని పిలిచే గొంతు నాకు వినపడదు… తారకరత్న మృతి పై లోకేష్ ఎమోషనల్ ట్వీట్!

Nara Lokesh: నందమూరి తారకరత్న గత మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా తారకరత్న మృతి చెందడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలోనూ నందమూరి అభిమానులు టిడిపి కార్యకర్తలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలపడం కోసం వెళ్ళినటువంటి తారకరత్న ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు గుండెపోటు రావడం అనంతరం ఈ ప్రభావం మెదడుపై చూపించడంతో ఈయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ 23 రోజులపాటు చికిత్స తీసుకుంటున్నప్పటికీ చివరికి విధి చేతిలో ఓడిపోయారు.

ఈ విధంగా తారకరత్న మరణించడంతో టీడీపీ యువ నాయకుడు లోకేష్ తన పాదయాత్రను రద్దు చేసుకొని తారకరత్నకు నివాళులు అర్పించడం కోసం హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తారకరత్నకు కన్నీటి నివాళులు అర్పించారు. ఇక లోకేష్ పాదయాత్ర కూడా రద్దు అయింది. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తారకరత్న మృతి పై స్పందిస్తూ చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Nara Lokesh: నీ స్నేహబంధం బంధుత్వం కన్నా గొప్పది…

లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినపడదు.. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళి అర్పిస్తూ తారకరత్న మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago