Movie News

Tarakaratna: సోమవారం హైదరాబాదులో తారకరత్న అంత్యక్రియలు… హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతిక కాయం!

Tarakaratna: నందమూరి తారకరత్న గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఈయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

ఇలా గుండెపోటుకు గురైన సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతోనే ఈయన మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిందని తద్వారా ఈయన గత 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం ఈయన శరీరం వైద్యానికి సహకరించలేదని నిపుణులు వెల్లడించారు. ఇలా ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఈయనకు చికిత్స జరిగినప్పటికీ చివరికి ఈయనని ప్రాణాలతో కాపాడుకోలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈయన ఫిబ్రవరి 18వ తేదీ శ్వాస విడిచారు. ఇలా నందమూరి తారకరత్న మృతి చెందారని వార్త ఇటు నందమూరి అభిమానులలో కుటుంబ సభ్యులలో జీర్ణించుకోలేని విషయంగా మారింది. తారకరత్న మరణించడంతో ఈయన పార్థివ దేహం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది.మొదటగా ఈయన పార్థివదేహాన్ని మోకిలలో ఉన్నటువంటి తన సొంత నివాసానికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు.

Tarakaratna: మహాప్రస్థానంలో అంత్యక్రియలు…


ఇలా అభిమానుల సందర్శనాంతరం సోమవారం ఈయన అంతిమయాత్ర మొదలవుతుంది.సోమవారం సాయంత్రం హైదరాబాదులోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఇక తారకరత్న మరణించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పై స్పందిస్తూ తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago