Nara Lokesh: నందమూరి తారకరత్న గత మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా తారకరత్న మృతి చెందడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలోనూ నందమూరి అభిమానులు టిడిపి కార్యకర్తలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలపడం కోసం వెళ్ళినటువంటి తారకరత్న ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు గుండెపోటు రావడం అనంతరం ఈ ప్రభావం మెదడుపై చూపించడంతో ఈయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ 23 రోజులపాటు చికిత్స తీసుకుంటున్నప్పటికీ చివరికి విధి చేతిలో ఓడిపోయారు.
ఈ విధంగా తారకరత్న మరణించడంతో టీడీపీ యువ నాయకుడు లోకేష్ తన పాదయాత్రను రద్దు చేసుకొని తారకరత్నకు నివాళులు అర్పించడం కోసం హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తారకరత్నకు కన్నీటి నివాళులు అర్పించారు. ఇక లోకేష్ పాదయాత్ర కూడా రద్దు అయింది. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తారకరత్న మృతి పై స్పందిస్తూ చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Nara Lokesh: నీ స్నేహబంధం బంధుత్వం కన్నా గొప్పది…
లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినపడదు.. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ తారకరత్న మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.
బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G
— Lokesh Nara (@naralokesh) February 18, 2023

































