Tarakaratna: తారకరత్న మృతి పై అనుమానాలు ఉన్నాయి… సిబీఐ ఎంక్వయిరీ చేయాలి… మొదలైన శవ రాజకీయాలు!

Tarakaratna: నందమూరి తారకరత్న మరణించి దాదాపు 3 నెలలు అవుతుంది. అయితే ఈయన చనిపోయిన మూడు నెలలకు ఈయన మరణం పై అనుమానాలు ఉన్నాయని ఈయన మరణం పై సిబిఐ ఎంక్వయిరీ చేయాలి అంటూ కేఏ పాల్ డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది.

నందమూరి తారకరత్న సినిమాలలో నటించారు. అయితే సినిమాలలో సక్సెస్ కాలేకపోయినా ఈయన రాజకీయాలలోకి వెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే జనవరి 27వ తేదీ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు పలుకుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్రలో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిన ఈయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఇలా బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో దాదాపు 23 రోజుల పాటు మృత్యులతో పోరాడిన ఈయన ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.అయితే ఈయన మరణం పై అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. పాదయాత్ర ప్రారంభమైన రోజు తారకరత్న చనిపోయారని అయితే ఈ విషయాన్ని బయట పెడితే లోకేష్ పాదయాత్ర పై నెగిటివ్ ప్రభావం పడే అవకాశాలు ఉండటం వల్లే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయాన్ని దాచి పెట్టారు అంటూ లక్ష్మీపార్వతి ఆరోపణలు చేశారు.

Tarakaratna: పాదయాత్రకు వెళ్లకపోయి ఉంటే బ్రతికేవారు…


అయితే తాజాగా ఈ విషయంపై కేఏ పాల్ మాట్లాడుతూ తారకరత్న మరణం పై తమకు అనుమానాలు ఉన్నాయని తప్పకుండా సిబిఐ ఎంక్వయిరీ చేసి ఆయన ఎప్పుడు చనిపోయారో బయట పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు. ఆరోజు పాదయాత్రకు పోకపోయుంటే తారకరత్న బ్రతికి ఉండేవారని తెలిపారు. ఆయన చనిపోయిన సమయంలో రాజకీయాలు చేయకూడదన్న ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చానని పాల్ వెల్లడించారు. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు మరణించారనే విషయం బయట పెట్టాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.