Adhire Abhi: ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోకి మంచి రేటింగ్స్ నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా కమెడియన్లకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో అదిరే అభి కూడా ఒకరు. అయితే అభి చాలాకాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు.
ఇది ఇలా ఉండగా తాజాగా డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవటానికి మల్లెమాల వారు ఇచ్చే తక్కువ పారితోషితమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకోవటానికి ముందు వీడియోలో
ప్రస్తావించిన విషయాల గురించి అదిరే అభి స్పందించాడు. .ఈ క్రమంలో అభి మాట్లాడుతూ..” జబర్దస్త్ ఆర్టిస్టులు, ఢీ కంటెస్టెంట్లకు ఇచ్చే పారితోషికం మధ్య భేదాలు ఉన్న సంగతి వాస్తవమేనని తెలిపాడు.
జబర్దస్త్ ఆర్టిస్టులతో పోలిస్తే ఢీ వారికి పారితోషకం తక్కువగానే ఉంటుందని తెలిపాడు. అయితే ఇలా వ్యత్యాసం ఉండటానికి కూడా ముఖ్య కారణం ఉందని అభి చెప్పుకొచ్చాడు. షో రేటింగ్స్ ని బట్టి ఆ షో కోసం పనిచేసే వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుందని తెలిపాడు. జబర్దస్త్ షో కి ఎక్కువ రేటింగ్స్ ఉండటం వల్ల జబర్దస్త్ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. మల్లెమాల వారు శ్రమ దోపిడి చేస్తున్నారు అనే వార్తలను అభి ఖండించాడు.
నెలలో పది రోజులు మల్లెమాల కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 రోజులు ఇతర ఈవెంట్స్ చేసుకోండి.. లేదంటే మరేదైనా చేసుకోండి అన్నట్లుగా వారు ఇవ్వాల్సిన మొత్తం ఇస్తారు అంటూ అభి తెలిపాడు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అవకాశాల కోసం చాలా కష్టపడాలి. ఒకవేళ అవకాశాలు వచ్చినప్పటికీ మనం సంపాదించిన దానిలో కొంతవరకు భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ అభి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అది చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…