Music Director Koti : మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి గా ఇండస్ట్రీలోకి మ్యూజిక్ తోనే అడుగుపెట్టిన కోటి మొదట్లో రాజ్ తో కలిసి రాజ్ కోటి గా ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇద్దరూ విడిపోయి ఎవరికి వారు సినిమాలను చేసిన రాజ్ కోటి ధ్వయం ఆ తరువాత కూడా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక కోటి చిరంజీవి, బాలకృష్ణ వంటి అందరు అగ్ర హీరోలకూ మ్యూజిక్ చేస్తూ ఎన్నో హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడం వల్ల గ్యాప్ తీసుకున్న కోటి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో దాసరి నారాయణ రావు గారితో ఉన్న అనుబంధం గురించి వివరించారు.
గొడవతో ఇద్దరం మొహం చూసుకోలేదు…
దాసరి గారి ప్రతి సినిమాకు కోటి గారు మ్యూజిక్ చేసారు. దాసరి నారాయణ రావు గారు కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు గారితో పనిచేసినపుడు కూడా కోటి గారిని చాలా ప్రేమగా మాట్లాడించేవారట. అలాంటి దాసరి గారికి పక్కన ఉన్న వాళ్ళు కోటి గురించి తప్పుగా చెప్పడం వల్ల శ్రీహరి గారితో తీసిన ‘మేస్త్రి’ సినిమా తరువాత సినిమా చేయలేదట.
కారణాలు పెద్దగా తెలియదు కానీ ఆయన నన్ను దూరం పెట్టాడు అంటూ కోటి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక మళ్ళీ దాసరి గారు ఆయన సినిమాల్లో కోటి గారిని తీసుకోలేదట. ఇక మళ్ళీ దాసరి గారితో మాట్లాడటం కానీ, కలవడం కానీ జరగలేదని కోటి గారు తెలిపారు. చనిపోయినపుడు కూడా అమెరికాలో ఉండటం వల్ల రాలేకపోయాను, చివరిసారిగా చూడలేక పోయాను, ఆయన నా కెరీర్ లో నన్ను చాలా ప్రోత్సాహించిన వారిలో ఒకరు అంటూ తెలిపారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…