Movie News

Actress Trisha: మగవాడిగా పుట్టి వారిని అర్థం చేసుకోవాలనుంది.. త్రిష షాకింగ్ కామెంట్స్!

Actress Trisha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1999లో మొదటిసారి నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష 24 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా తన 40వ పుట్టినరోజుని జరుపుకుంది.

40 పదుల వయసులో కూడా త్రిష అందానికి అభిమానులు ముగ్ధులు అవుతున్నారు. అయితే ఇప్పటికీ అమ్మడు పెళ్లికి దూరంగా బ్యాచిలర్ గానే జీవిస్తోంది.

తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ లో కూడా కీలక పాత్రలో సందడి చేసింది. ఇదిలా ఉండగా మగవారి గురించి ఇటీవల త్రిష చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష కి పురుషుల గురించి మీ అభిప్రాయం ఏమిటి ? అనే ప్రశ్న ఎదురయింది. ఇక ఈ ప్రశ్నకు త్రిష స్పందిస్తూ..” సాధారణంగా ఆడవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టమని అంటుంటారు. కానీ మగవారిని అర్థం చేసుకోవడమే చాలా కష్టం అంటూ తెలిపింది.

gh

Actress Trisha: మగవారిని అర్థం చేసుకోవడం కష్టం…

మగవారు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొక విధంగా నటిస్తారు. వారి మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నాకు ఒక రోజు మగవాడిగా పుట్టాలనిపిస్తుంది అంటూ త్రిష చెప్పకు వచ్చింది. ఈ విషయాన్ని తాను తన తల్లితో కూడా చెప్పినట్లు త్రిష వెల్లడించింది. పురుషుల గురించి ప్రస్తుతం త్రిష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago