Director Dhavala Satyam : విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం తన చిత్రాల ద్వారా కమ్యూనిజం భావాలను చూపించాడు. ఎర్ర మల్లెలు, భీముడు, యువతరం కదిలింది, జాతర, చైతన్య రథం, నేను సైతం వంటి చిత్రాలను తీశారు. నాటక రంగంతో పరిచయమున్న ధవళ సత్యం, దాసరి నారాయణ రావు గారి శిష్యుడు. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
చిరంజీవి వద్దని చంద్రమోహన్ ను పెట్టుకోమన్నారు…
తాను డైరెక్టర్ గా మొదట సినిమా చేయాలని అనుకున్నపుడు చిరంజీవినే హీరోగా తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారట సత్యం. అయితే సత్యం గారు ఆయన గురువు దాసరి వద్దకు వెళ్లి చెబితే మొదటి సినిమా అందరూ కొత్తవాళ్ళైతే ఎలా, హీరోగా మన దగ్గర డేట్స్ ఉన్న హీరో ని చూద్దాం అని చంద్రమోహన్ ను తీసుకోమని సలహా ఇచ్చారట. అయితే అప్పటికే శివరంజని సినిమా ఆడిషన్ కోసం వచ్చిన చిరు నటన చూసిన సత్యం ఆ రోజే తనతో హీరోగా సినిమా చేయాలని అనుకున్నారట.
ఇక ధవళ సత్యం తన సినిమా ప్రస్థానంలో మైలురాయి వంటి సినిమా ‘జాతర’ చిరంజీవిని హీరోగా డిసైడ్ అయ్యారు. మిగిలిన చిత్ర బృందాన్ని ఒప్పించడానికి కష్టపడ్డానని కానీ చివరకు చిరంజీవినే హీరోగా సినిమా తీసానని ఆ సినిమా గురించి చెబుతారు సత్యం. ఇక ఆ సినిమా నేడు మంచి కమర్షియల్ హిట్ అయి రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమా కథ ఒకటేనని చెప్పారు. చిరంజీవి మంచి స్థాయికి వెళ్తాడని ఎపుడో తాను చెప్పానని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…