NTR: నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.
ఎన్టీఆర్ నటనకు మన దేశీయ దిగ్గజాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ తో కలిసి పని చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ థర్టీ సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత నీల్ తో కలిసి మరొక సినిమాలో చేయనున్నాడు. ఆ తర్వాత బుల్లితెర మీద హోస్ట్ గా సందడి చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరుడు, బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ వన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సక్సెస్ అయ్యింది .ఇక అప్పటినుండి ఎన్టీఆర్ బుల్లితెర మీద ఎక్కడా కనిపించలేదు. ఇక మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ తొందర్లోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్న షో గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు. అయితే ఎన్టీఆర్ మరొకసారి ఇలా బుల్లితెర మీద సందడి చేయబోతున్నాడు అనే విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…