Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన తాజాగా రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా నేడు విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా గోపీచంద్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను తెలియజేశారు.
ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు నటి కుష్బూ వంటి వారందరూ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా గోపీచంద్ జగపతిబాబు ఇద్దరు కలిసి హీరో నవదీప్ తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ కు నవదీప్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మరోసారి ప్రభాస్ తో విలన్ గా నటించే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఇలా నవదీప్ అడిగిన ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెబుతూ…ప్రభాస్ తో విలన్ గా చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు. అయితే తన పాత్ర మాత్రం నిజం వర్షం జయం సినిమాలలో మాదిరిగా నా పాత్ర కథను ఎలివేట్ చేసే విధంగా ఉండాలని కండిషన్ పెట్టారు ఇలా ఉంటేనే నటిస్తానని తెలిపారు. తామిద్దరం కలిసి ఇదివరకే వర్షం సినిమాలో నటించామని అదే తరహాలోనే నా పాత్ర ఉండాలని తెలిపారు.
ఇలా ప్రభాస్ తో ఢీకొట్టే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానంటూ గోపీచంద్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతాయి. అయితే తెరపై వీరిద్దరూ పోటీకి సిద్ధమైనప్పటికీ తెర వెనక మాత్రం ఇద్దరు కూడా ప్రాణ మిత్రులే అనే విషయం మనకు తెలిసిందే. వ్యక్తిగతంగా ప్రభాస్ గోపీచంద్ కూడా మంచి స్నేహితులు. ఇక వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…