Comedian Mahesh:జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ మెల్లిగా సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు కమెడియన్ మహేష్.ఈయనకు రంగస్థలం సినిమాలో అవకాశం వచ్చింది అయితే ఈ సినిమాలో తన పాత్రకు మంచి మార్కులు పడటంతో ఏకంగా రంగస్థలం మహేష్ గా మారిపోయారు.
ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేశ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని మాది ఈస్ట్ గోదావరి జిల్లా అని తెలిపారు.
ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు కష్టపడుతున్నారు. దేవుడి దయవల్ల నాకు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే తప్పకుండా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటూ మహేష్ తెలిపారు. ప్రస్తుతమైతే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని ఒకవేళ ఎమ్మెల్యేగా టికెట్ వస్తే తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు.
ఇక తాను పవన్ కళ్యాణ్ గారితో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించాను. పవన్ కళ్యాణ్ గారిది చాలా మంచి వ్యక్తిత్వం.షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి ఫుడ్ అయితే వస్తుందో అందరికీ కూడా అదే ఫుడ్ పెట్టాలని అందరినీ సమానంగా చూసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది అంటూ ఈ సందర్భంగా మహేష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…