Tarakaratna: 23 రోజులు వైద్యం అందించిన తారకరత్న కోలుకోకపోవడానికి కారణం ఏంటి.. అసలేం జరిగింది?

Tarakaratna: నందమూరి తారకరత్న ఇకలేరనే వార్త నందమూరి అభిమానులలోను టిడిపి కార్యకర్తలలోనూ తీవ్ర విషాదం నింపింది.లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నపలంగా హార్ట్ స్ట్రోక్ రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఈయనను సమీప ఆసుపత్రికి తరలించే అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

ఇలా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఈయనకు ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో గత 23 రోజులగా వెండిలేటర్ పై చికిత్స అందుతుంది. ఇలా 23 రోజుల నుంచి నిపుణుల సమక్షంలో చికిత్స అందుతున్నప్పటికీ ఈయన ఆరోగ్య విషయంలో ఏ మాత్రం మెరుగు కనిపించకపోవడంతో ఒకవైపు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు.

తారకరత్న విషయంలో నందమూరి కుటుంబ సభ్యులకు కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పూజలు హోమాలు కూడా చేశారు. ఇలా ఒకవైపు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

Tarakaratna: తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తారకరత్న….


ఈ విధంగా 23 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నటువంటి తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఆయన బ్రెయిన్ ఫంక్షన్స్ జరగకపోవడమే. ఈయన పాదయాత్రలో హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆ ప్రభావం మెదడుపై పడిందని దాంతో మెదడు పనితీరు తగ్గిపోవడం వల్ల ఈయన వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదని అలాగే వైద్యులు ఎంతో శ్రమించినప్పటికీ ఆయన మెదడు పనితీరులో ఏమాత్రం మెరుగు లేకపోవడంతోనే ఆయన మరణించారని తెలుస్తోంది.ఏది ఏమైనా క్షేమంగా తిరిగి వస్తారు అనుకున్న తారకరత్న ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు