Tarzon Lakshmi Narayana : ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటి… ఆయన ఎమన్నా పాకిస్థాన్ నుండి వచ్చాడా…: నటుడు టార్జాన్ లక్ష్మి నారాయణ

Tarzon Lakshmi Narayana : తెలుగులో విలన్ గా అనేక సినిమాల్లో నటించిన లక్ష్మి నారాయణ. విలన్ పక్కన ఎక్కువ పాత్రల్లో కనిపించారు. తెలుగు,తమిళం, హిందీ అంటూ పలు భాషలలో నటించాడు. హైదరాబాద్ కి చెందిన లక్ష్మి నారాయణ కు మొదట సినిమాలంటే ఏమాత్రం తెలియక ముందే షూటింగ్ కి వచ్చి తెలియక ఒకరి ముక్కు పగులగొట్టాడట. ఇక ఆర్జీవి సినిమాల్లో ఎక్కువగా నటించిన లక్ష్మీనారాయణ ఆతరువాత ఆయన శిష్యుల సినిమాల్లో కూడా అవకాశలు అందుకుని తెలుగు తమిళం లో దాదాపు అందరు డైరెక్టర్లతోను పనిచేసారు.తాజాగా ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించిన అనుభవాలను పంచుకున్నారు.

ప్రకాష్ రాజ్ ఏమి పాకిస్థాన్ నుండి రాలేదు…

లక్ష్మి నారాయణ గారు అప్పట్లో ఆర్జివి ద్వారానే సినిమాల్లోకి వచ్చి ఆయన చెప్పారని కొందరు ప్రొడ్యూసర్స్ ను బెదిరించడం సెటిల్మెంట్స్ చేయడం వంటివి కూడ చేసారు. అయితే అవన్నీ సరదాగా చేసే వాడినని నిజంగా ఎవుడు ఎవరిని బెదిరించలేదంటు చెప్తారు. ఆయన ప్రస్తుతం సినిమాలను తక్కువగా చేస్తూ వ్యాపారం లో బిజీగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక వైపు అడుగులేసి పూర్తిగా మారిపోయిన ఆయన గత మా ఎలక్షన్ గురించి మాట్లాడుతూ ఆయన నరేష్ ప్యానెల్ లో మొదటి నుండి ఉండి చివరగా ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు మద్దతు ఇచ్చారానే విషయం గురించి మాట్లాడారు.

ప్రకాష్ రాజ్ గారు వ్యక్తిగతంగా బాగా తెలుసనీ ఆయన చాలా మంచి మనిషి అంటూ చెప్పారు. షాద్ నగర్ లో ఎంతోమందికి అయన సహాయం చేసారు, ఇల్లు కట్టించారు. రెండు ఊర్లను దత్తత తీసుకుని బాగోగులు చూస్తున్నారు అలాంటి అయన మా అధ్యక్షుడిగా ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ చేస్తారనే నమ్మకం కలిగింది అందుకే ఆయనకు మద్దతుగా నిలిచాను. ఆయన పర భాషా నటుడు అంటూ ఆయనకు ఓటు వేయలేదు. కళాకారుడికి భాష ఏంటి అన్ని భాషలు ఒకటే. అయినా ఆయన ఏమైనా పాకిస్థాన్ కి చెందిన వాడా ఇండియన్ కదా అలా ఆలోచించడం నాకు నచ్చలేదు అంటూ అయన అభిప్రాయపడ్డారు.