Tdp Leader Jaleel khan : ఆ పార్టీ లో ఐదేళ్ళు ఉండమని వాళ్ళను నేనే పంపాను…: టీడీపీ నేత జలీల్ ఖాన్

Tdp Leader Jaleel Khan : వైస్సార్ కాంగ్రెస్ నుండి 2014 ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ మెజారిటీ తేడాతో విజయవాడ వెస్ట్ అభ్యర్తిగా గెలిచారు జలీల్ ఖాన్. అయితే 2016 లో టీడీపీ లోకి జంప్ అయిన ఆయన అప్పటి నుండి ఆ పార్టీ లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న ఆయన వైసీపీ పార్టీ లో తన వాళ్ళు చాలా మంది ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేసారు. వైసీపీ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం గాలికి వదిలేసిందని ఆరోపణలను చేస్తున్నారు జలీల్ ఖాన్.

ఐదేళ్ళు ఉండమని నేనే పంపా….

జలీల్ ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ వైసీపీ లో ఉన్న వాళ్లలో 60% మంది నాకు తెలిసిన వాళ్ళే అంటూ చెప్పారు. నేను ఊ అంటే వైసీపీ నుండి బయటికి వచ్చేయడానికి రెడీ గా ఉన్నారంటూ చెప్పారు. వైసీపీ వచ్చాక నేనే ఐదేళ్ళు ఖాళీగా ఎందుకుంటారు అని చెప్పి ఆ పార్టీలోకి పంపాను నేను రమ్మంటే బయటికి వచ్చేస్తారు అంటూ తెలిపారు జలీల్ ఖాన్.

ముస్లిమ్ మైనారిటీల కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఏమాత్రం పట్టించుకోవడం లేదని గతంలో తమ ప్రభుత్వం ఉన్నపుడు ముస్లిం సంక్షేమం కోసం చేసిన పనుల గురించి వివరించారు. నిజానికి టీడీపీ నేత జలీల్ ఖాన్ అనే కంటే బి కామ్ లో ఫిజిక్స్ అనగానే తెలుగు ప్రజలకు టక్కున గుర్తొస్తాడు.