Ileana: గోవా ముద్దుగుమ్మ ఇలియానా ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఇలియానా వరుస ఫ్లాప్ సినిమాలలో నటించడంతో ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాని నమ్ముకున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదిక తరచు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు.ఇలా నిత్యం గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేసే ఇలియానా తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
ఈమె పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నాను అంటూ చేసినటువంటి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి.
చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో మామా అంటూ ఉన్న చైన్‌ని షేర్ చేసింది. `అండ్ సో ది అడ్వెంచర్ బిగిన్స్ అని రాసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని షేర్ చేయడమే కాకుండా కమింగ్ సూన్ నా చిన్నారి డార్లింగ్ బేబీని కలవడం కోసం ఆత్రుతగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఏంటి పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతున్నారా అసలు తాను ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు? పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు అంటూ ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా డైరెక్ట్ గా బేబీకి కాబోయే తండ్రి ఎవరు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇలా బేబీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…