Movie News

Saidharam Tej: సాయిధరమ్ తేజ్ కి ఇది పునర్జన్మ… ఎమోషనల్ కామెంట్స్ చేసిన సుకుమార్!

Saidharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకున్నటువంటి సాయి ధరంతేజ్ నటించిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఏలూరులో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే ఇక ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో సుకుమార్ హీరో సాయిధరమ్ తేజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ ఎంతో చలాకీగా ఉండేవారు.

ఇక ఈయన రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత మొదటిసారి ఈయనని తిరిగి షూటింగ్ లొకేషన్లో చూసినప్పుడు తనకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు.ఎంతో అద్భుతమైన నటనను కనబరిస్తూ, ఎంతో అవలీలగా డాన్స్ చేసే సాయి తేజ్ ప్రమాదం తర్వాత నటించడానికి, డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ క్షణం తనని చూసి కన్నీళ్లు ఆగలేదని ఈ సందర్భంగా సుకుమార్ తెలిపారు.

Saidharam Tej:డాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారు…

ఈ ప్రమాదం నుంచి బయటపడి ఈయన కోలుకొని తిరిగి సినిమా షూటింగ్ లొకేషన్లోకి రావడం చాలా సంతోషంగా అనిపించింది.నిజంగానే ఇది ఈయనకు పునర్జన్మ అంటూ సాయి తేజ్ గురించి సుకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రమాదం తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా రాబోతున్న ఈ హీరోకి ఎలాంటి సక్సెస్ అందుతుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago