AP politics: టీడీపీ మూడో జాబితా విడుదల… భగ్గుమన్న శ్రీకాకుళం.. మేనిఫెస్టో కాల్చివేత?

AP politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి175 స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను, అలాగే 25 స్థానాలలో ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి గొడవలు కానీ నిరసనలు కానీ చోటు చేసుకోలేదు.

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి టికెట్లు రాకపోవడంతో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు గత కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా మూడో జాబితాను కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేశారు ఈ క్రమంలోనే ఈ జాబితాలో కూడా తమ పేరు లేకపోవడంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనలకు తెర తీశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్‌కు టికెట్‌ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు.

చంద్రబాబు ఫోటో ధ్వంసం..
చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలా తనకు టికెట్ రాకపోవడంతో తాను పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ ఈమె పార్టీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.