AP politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి175 స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను, అలాగే 25 స్థానాలలో ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి గొడవలు కానీ నిరసనలు కానీ చోటు చేసుకోలేదు.
ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి టికెట్లు రాకపోవడంతో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు గత కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా మూడో జాబితాను కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేశారు ఈ క్రమంలోనే ఈ జాబితాలో కూడా తమ పేరు లేకపోవడంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనలకు తెర తీశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్‌కు టికెట్ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు.
చంద్రబాబు ఫోటో ధ్వంసం..
చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలా తనకు టికెట్ రాకపోవడంతో తాను పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ ఈమె పార్టీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…
ఇటీవలి కాలంలో “2026లో ప్రపంచ యుద్ధం జరుగుతుందా?” అనే చర్చలు సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పురాణాల్లోని కొన్ని…
పూజా గదిలో నీళ్లు ఉంచే ఆచారం వెనుక అసలు కారణం ఏమిటి? చాలా మంది ఇళ్లలో ఇది సాధారణంగా కనిపించే…
జన్మతేదీల ఆధారంగా వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి గురించి అంచనాలు చెప్పే సంఖ్యాశాస్త్రంపై ఆసక్తి పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని…