Thammareddy Bharadwaj : సిల్క్ స్మిత తో కృష్ణ సాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు… బాబు మోహన్ కోసం అలా చేస్తావా అని సినిమా సెట్స్ నుండి వెళ్లిపోయారు… సంవత్సరం జైల్లో పెట్టించాను…: తమ్మారెడ్డి భరద్వాజ

Thammareddy Bharadwaj : తెలుగు సీనియర్ నిర్మాత మరియు దర్శకుడైన తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుంది. తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా డైరెక్టర్ గా మంచి సినిమాలను తీసారు. ఇక తమ్మారెడ్డి అనగానే కృష్ణా గారితో తీసిన పచ్చని సంసారం సినిమా గుర్తొస్తుంది. అయితే ఆ సినిమా తరువాత కృష్ణ గారితో చాలా రోజుల తరువాత మళ్ళీ సినిమా ప్లాన్ చేసారు. అదే రౌడీ అన్నయ్య. రౌడీ అన్నయ్య సినిమా కథ భరద్వాజది కాదు కృష్ణ గారే భరద్వాజకు ఒకరి దగ్గర మంచి కథ ఉంది సినిమా చేద్దామని చెప్పడంతో కథ తీసుకోడానికి వెళితే ఆయనే దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి గారు.

సిల్క్ స్మితతో పాటలో కృష్ణ గారి పై కుట్ర…

ఇక సినిమా మొదలైనప్పటి నుండి సిల్క్ స్మిత పాట విషయంలో కృష్ణ గారితో వివాదం మొదలయింది. క్లైమాక్స్ లో సిల్క్ స్మిత పాట ఉంటుందని డిజైన్ చేశారట. కానీ పాట బాబు మోహన్ తో ఉండాలని తమ్మారెడ్డి భావించారు. కానీ కృష్ణ గారు చివర్లో వచ్చే పాటలో నేను లేకపోతే ప్రేక్షకులు ఒప్పుకోరని వాదించారు. ఇక సినిమా షూటింగ్ అంతా పూర్తి అయినా పాటను మాత్రం పెండింగ్ పెట్టారట. చివరకు నిర్మాతతో కలిసి ఒక ప్లాన్ చేసారు తమ్మారెడ్డి.

పగలు కృష్ణ… రాత్రి బాబు మోహన్ తో సిల్క్ స్మిత పాట…

ఇక కృష్ణ గారితో పగలు సిల్క్ స్మిత పాట షూట్ చేసారు. ఆయనకు తెలియకుండా రాత్రికి బాబూమోహన్ తో పాటను షూట్ చేసారు. ఈ విషయం కృష్ణ గారికి తెలియకుండా మేనేజ్ చేసారు దర్శక నిర్మాతలు. అయితే సెన్సర్ విషయంలో పాటను తీసేయాలని చెప్పడంతో కృష్ణ గారే స్వయంగా సెన్సర్ బోర్డు మెంబెర్ సుబ్బిరామిరెడ్డిపై ఫైర్ అయ్యారట. తీరా చూస్తే పాటలో కృష్ణ గారికి బదులుగా బాబూమోహన్ ఉండటంతో కృష్ణ గారికి బాగా కోపం వచ్చినా చాలా హుందాగా తమ్మారెడ్డి వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మన ఫ్రెండ్ షిప్ ఎండ్ అయింది బాగా చేసావ్ అని అన్నారట. ఆ తరువాత ఆ పాటను మళ్ళీ మూడో సారి కృష్ణ గారే స్వయంగా డైరెక్టర్ చేసారు. కానీ ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం తమ్మారెడ్డి ఆఫీస్ పై దాడి చేయడం ఆ తరువాత తమ్మారెడ్డి కేసు పెట్టడం వంటి రచ్చ ఒక సంవత్సరం పాటు కొనసాగింది. ఆ తరువాత తమ్మారెడ్డి గారు కృష్ణ గారితో మళ్ళీ కలిశారట. అలా కృష్ణ గారితో జరిగిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు తమ్మారెడ్డి. అయితే ఆరోజు కృష్ణ గారే కరెక్ట్ ఒక మాస్ హీరో అయినా కమెడియన్ తో డాన్స్ ఏంటి అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది లో బ్రహ్మానందంతో డాన్స్ చేసారు, ఆ సన్నివేశం చూసినపుడు నాకు నా తప్పు అర్థమైందని చెప్పారు.