Seniour Naresh: నేను టాప్ లో ఉండడానికి కారణం అదే.. ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మిస్తా: సీనియర్ నరేష్!

Seniour Naresh: నేను టాప్ లో ఉండడానికి కారణం అదే.. ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మిస్తా: సీనియర్ నరేష్!

Seniour Naresh: సినీ ఇండస్ట్రీలో సీనియర్ నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నేడు (జనవరి 20) నరేష్ పుట్టినరోజు కావడంతో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Seniour Naresh: నేను టాప్ లో ఉండడానికి కారణం అదే.. ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మిస్తా: సీనియర్ నరేష్!
Seniour Naresh: నేను టాప్ లో ఉండడానికి కారణం అదే.. ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మిస్తా: సీనియర్ నరేష్!

ఈ సందర్భంగా నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తాను పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేదని తెలిపారు.1972 లో వచ్చిన పండంటి కాపురం సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చాను. ఇలా నా సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఎంతగానో సహకరించిన కృష్ణ విజయనిర్మల అలాగే తన గురువు గారు జంధ్యాల గారికి నరేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Seniour Naresh: నేను టాప్ లో ఉండడానికి కారణం అదే.. ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మిస్తా: సీనియర్ నరేష్!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి సుమారు 50 సంవత్సరాలు అవుతుందని ఈ ఏడాది నుంచి తిరిగి ఈ బ్యానర్ పతాకాన్ని ఎగుర వేయాలని భావిస్తున్నట్లు నరేష్ తెలిపారు. అందుకే ఈ ఏడాది నుంచి ఈ బ్యానర్ పై చిత్రాలను నిర్మిస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలియజేశారు.

మా అమ్మ ఎప్పుడు ఆ మాట చెప్పేది…

ఈ ఏడాది అమ్మ పేరుతో స్టూడియోను అందుబాటులోకి తీసుకు వస్తున్నాను. నాలుగు స్తంభాలాట సినిమా సమయంలో గౌరవం నువ్వు ఆశించకు.. అందరికీ ఇవ్వు అని ఎప్పుడు మా అమ్మ చెప్పేదని, ఆ మాటలు ఇప్పటికీ ఫాలో అవడం వల్లే నేను టాప్ లో ఉన్నానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా దర్శకత్వం చేయాలనే కోరిక కూడా ఉందనే విషయాన్ని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ సినిమాలో అలాగే నవీన్ పోలిశెట్టి సినిమాలో చేస్తున్నారని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు. ఇక సినిమా టికెట్ల వ్యవహారం పై స్పందించిన ఈయన ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి అయితే మంచి నిర్ణయం వస్తుందని ఆశిద్దాం అంటూ టికెట్ల గురించి స్పందించారు.