Dhanush Father: ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలుస్తారు… విడాకుల పై స్పందించిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా!
Dhanush Father: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమారు 18 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఈ జంట ఒక్కసారిగా వీరి విడాకుల గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ విధంగా ఈ జంట విడాకుల గురించి ప్రకటించడంతో అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం షాక్ కి గురయ్యారు.ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ధనుష్ ఐశ్వర్య విడాకుల విషయం పై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా అందరు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలే ఐశ్వర్య, ధనుష్ మధ్య ఉన్నాయి త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తిరిగి వీరిద్దరూ కలుస్తారని కస్తూరి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలో లేరని, హైదరాబాద్ లో ఉన్నారని, ఇద్దరికీ ఫోన్లు చేసి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే కస్తూరి రాజా మాట్లాడుతూ చాలా మంది సినీ సెలబ్రిటీలు వారి పిల్లల భవిష్యత్తు కోసం విడాకుల నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని కస్తూరి రాజా పేర్కొన్నారు.రజినీకాంత్ కూడా వీరితో మాట్లాడారని విడాకుల గురించి మరొకసారి ఆలోచన చేయాలని వీరిద్దరికీ సూచించినట్లు తెలిపారు. అయితే రజనీకాంత్, కస్తూరి రాజా చెప్పిన మాటలను విని వీరి విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదంటే విడాకులు తీసుకొని విడిపోతారా అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…