Deepthi Sunaina - Shanmukh: షన్నూ.. దీప్తి బ్రేకప్ పై స్పందించిన సిరి.. వీరి లవ్ మరి అంత వీకా..?
Deepthi Sunaina – Shanmukh: యూట్యూబ్ ద్వారా ఎన్నో వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ అదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది మరింత గుర్తింపు సంపాదించుకుంటే షణ్ముఖ్ జస్వంత్ ఉన్న పాపులారిటీని కాస్తా డామేజ్ చేసుకున్నారు.
ఇలా షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో సిరి హనుమంత్ తో ఎంతో చనువుగా ఉండటమే ఆయనకు నెగిటివ్ అయిందని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో వీరి వ్యవహారశైలి నచ్చక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ దీప్తి సునైనా తనకి బ్రేకప్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి లవ్ బ్రేకప్ కు కారణం సిరి అంటూ ఎంతోమంది షన్నూ అభిమానులు దారుణంగా తనని ట్రోల్ చేశారు.
ఇలా గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సిరి గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో ఈ విషయంపై సిరి స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు… తన వల్ల వారిద్దరూ విడిపోయారు అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు మరి వీరి లవ్ అంతా వీకా అంటూ సిరి కామెంట్ చేసింది. దీప్తి, షన్నూ తన వల్ల విడిపోలేదని కరాఖండిగా చెప్పేశారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో జెస్సీ, షన్నూ, తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని రవి తనకు బ్రదర్ లాంటి వాడని ఈ సందర్భంగా సిరి తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నాకు షణ్ముఖ్ జస్వంత్ మధ్య కాస్త ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ అయ్యాయి. అంతేకానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపారు. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా పై జరిగిన ట్రోల్స్ చూసి చాలా డిప్రెషన్లోకి వెళ్లి పోయానని ఇప్పుడిప్పుడే ఆ డిప్రెషన్ నుంచి బయటపడుతున్నానని ఈమె తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…