Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

Kapil Dev: ఇండియాలో క్రికెట్ క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా 1983లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా ఘన విజయం సాధించిన తర్వాత  ఈ క్రేజ్ మరింతగా పెరింగింది. ప్రస్తుతం 1983 లో వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్ లో  వస్తున్న మూవీ ’83‘ విడుదలకు సిద్ధమైంది. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్, కపిల్‌ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకోన్‌ నటించారు.

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!
Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

1983జూన్ 25న జరిగిన వరల్డ్ కప్ పోటీలో ఇండియా విశ్వ విజేతగా నిలిచిపోవడం మరవలేని క్షణాలని క్రికెట్ లెజెండ్ కపిల్ దేశ్ అన్నారు. 38 ఏళ్ల తర్వాత ‘83’ ద్వారా మరోసారి ఆ క్షణాలను వెండితెరపై ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కబీర్ ఖాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో 83 మూవీ నేడు విడుదల అవుతోంది.

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ప్రెస్ మీట్ లో హీరో నాగార్జున మాట్లాడుతూ.. 83లో నిజంగా కపిల్ దేవే నటించాడా.. అన్న రీతితో రణ్ వీర్ సింగ్ ఒదిగిపోయాడని పొగడ్తలు కురిపించారు. 83 హీరో రణ్ వీర్ సింగ్ మాట్లాడుతప.. కపిల్ దేవ్ లాంటి లెజెండ్ పాత్ర చేయడం గర్వంగా ఉందన్నారు. మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నా పాత్రను జీవా అద్భుతంగా చేశారని అన్నారు

రణ వీర్ సింగ్,దీపికా 83:

మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పకొచ్చారు శ్రీకాంత్.. నాగార్జున నేను ఇంజనీరింగ్ లో క్లాస్ మెట్స్ .. కాలేజీలో సైలెంట్ గా ఉన్న నాగ్.. శివతో వైలెంట్ ట్రెండ్ సెట్ చేశారన్నారు. చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈసినిమా కోసం కపిల్ తో పాటు అప్పటి టీం ను కలిసి సలహాలు తీసుకున్నామన్నారు. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత క్షణాలను, పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించామన్నారు. ముఖ్యంగా నేటి యువతరం చూడాల్సిన సినిమా అన్నారు