మేకపోతు అతడి పాలిట శాపంగా మారింది.. అసలేమైందంటే..

అతడు గొర్రెలు, మేకలను ప్రతీ రోజు అడవికి తీసుకెళ్లి కాస్తాడు. అంటే గొర్రెల కాపరి అన్నట్లు. అయితే అతడికి సొంతంగా కొన్ని గొర్రెలు, మేకలు కూడా ఉన్నాయి. అయితే అతడు ఉదయం, సాయంత్రం రెండు పూటలు అతడి వద్ద ఉన్న మేకల్లో కొన్ని మేకల నుంచి పాలు పితుకుతాడు.

ఓ రోజు ఇలానే మేక దగ్గరకు వెళ్లి పాలు పితుకుతున్న క్రమంలో ఆ మంద నుంచి ఓ మేకపోతు వచ్చి అతడి తలపై తన కొమ్ములతో పొడిచింది. దీంతో అతడికి రక్త స్రావం అయింది. వెంటనే అతడిని ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత ఏమైందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. ఆ కాపరి పాలిట ఆ మేకపోతు కాల యముడైంది.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మేకల కాపరి చీకోటి చంద్రయ్య (46) గత నెల 25న తన మేకల వద్దకు పాలు పితికేందుకు వెళ్లాడు. అతడు సాధారణంగా రోజూ ఇలానే వెళ్లి పాలు పితికి ఇంట్లోకి వెళ్లేవాడు. ఆ రోజు అతడికి దురదృష్టం అలా ఉంది. పాలు పితుకుతున్న సమయంలో వెనకు నుంచి ఓ మేకపోతు వచ్చి.. కొమ్ములతో ఆ చంద్రయ్య తలపై పొడించింది.

వెంటనే అతడిని కుటుంబసభ్యులు ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. చికిత్స తీసుకున్నా తగ్గలేదు. దీంతో సిరిసిల్ల దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. అక్కడ నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.