పూర్ణ కీలక పాత్రధారిగా కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్యాక్‌డోర్’. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన టీజర్ పది మిలియన్ వ్యూస్ తెచ్చుకోగా… ట్రైలర్ ఆ మార్కును దాటిపోయే దిశగా సందడి చేస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 3 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందింది. ఇటీవల హైదరాబాద్ లో ఈ చిత్రబృందం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రం పూర్తిగా మహిళ ప్రధాన కాథాంశం అని.. చక్కటి సందేశాన్ని జోడించడంలో బాలాజీ విజయం సాధించాడన్నారు.
ఈ చిత్రం తన కంటే చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడిన వివాహిత కథ ఇది. ఇక వారి అనుబంధం ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుంది.. అక్కడ నుంచి వాళ్లు ముందుకు ఎలా వెళ్తారు.. అనేదే ఆసక్తికరంగా ఉండనుంది. పూర్ణ కెరీర్‌లో విభిన్నమైన సినిమాగా నిలుస్తుందని చిత్ర దర్శకుడు అన్నారు.
నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. పూర్ణ పాత్రకు దగ్గట్లు నటించిందని.. ఆమె నటనలో మంచి ప్రతిభ కనబర్చిందని తెలిపారు. బ్యాక్‌డోర్ ఫస్ట్‌లుక్‌ను హీరో ఆది సాయికుమార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథలకు భిన్నమైన కథాంశంతో ఈ చిత్రం విడుదల కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…