ఉద్యోగం పోయింది.. రూ.7 కోట్లు సంపాదించినా వ్యక్తి!

కరోనా ఈ ప్రపంచం మొత్తం వ్యాపించడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేశాయి. దీంతో అన్ని ప్రైవేటు రంగాలు మూతపడడంతో ఎంతోమంది నిరుద్యోగులుగా మారిపోయారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం కావడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా వ్యాపించి అందరికీ ఎన్నో కష్టాలను తెచ్చిందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ కరోనా కొందరికి మాత్రం ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తి నవనీత్ సజీవన్‌కు.

కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్ సజీవన్‌ గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు.కరోనా వ్యాపించడంతో ఉన్నఫలంగా అతని ఉద్యోగం ద్వారా వచ్చే వేతనంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిస్తూ వస్తున్న ఆ కంపెనీ అతడిని నోటీసు పీరియడ్ కింద పని చేయించుకుంటూ ఉంది.చాలీచాలని జీతంతో ఎన్నో బాధలు అనుభవిస్తున్న నవనీత్ తన జీతంలో కొంత డబ్బుతో లాటరీ టికెట్ కొన్నాడు.

లాటరీ టికెట్ కొంటూ తనకు అదృష్టం కొంచమైనా ఉందో లేదో అని భావించి లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.ఆదివారం దుబాయి డ్యూటీ ప్రీ మిలీనియం మిలియనీర్ డ్రా నిర్వాహకులు నవనీత్‌కు ఫోన్ చేసి లాటరీ టికెట్ ద్వారా 7.4 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నారని చెప్పడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నవంబర్ 22న ఆన్లైన్ ద్వారా లాటరీ టికెట్ కొన్న నవనీత్ లాటరీ గెలవడంతో తన కష్టాలన్నీ తీరిపోయాయని ఎంతో సంబరపడ్డాడు. తన గెలుచుకున్న ప్రైజ్ మనీతో తన కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు తన స్నేహితులకు, సహోద్యోగుల అవసరాలకు కొంత డబ్బును వినియోగిస్తున్నట్లు నవనీత్ సజీవన్‌ తెలిపారు. లాటరీ ద్వారా ఒకే సారి ఇంత మొత్తంలో డబ్బులు గెలవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.