మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ఓటమికి కారణం.. నాగబాబేనా?

అక్టోబర్ 10వ తేదీ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటూ ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరి ప్యానల్ సభ్యుల గురించి మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇక అక్టోబర్ 10వ తేదీ జరిగిన ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పానల్ ఘోరంగా ఓటమి చవిచూసింది.

ప్రకాష్ రాజ్ ఇంత ఘోరంగా ఓడి పోవడానికి గల కారణం నాగబాబే అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మద్దతు తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టి నోటిదురుసు కారణంగానే మంచు విష్ణు అధిక మెజార్టీతో గెలిచాడని చెప్పవచ్చు.సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు అయిన కోటా శ్రీనివాస్ రావు పట్ల నాగబాబు మాట్లాడిన తీరుపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక సీనియర్ నటుడుని పట్టుకొని మనిషి కాదు.. జంతువు రేపు మాపో పోయే నీకెందుకు ఇలాంటి మాటలు అన్నీ అంటూ కోట శ్రీనివాస్ రావు గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలను పలువురు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. కోట శ్రీనివాస్ రావు గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు క్షమించరాని అంటూ ఎంతో మంది ప్రకాష్ రాజ్ ప్యానల్ కి కాకుండా విష్ణుకి ఓట్లు వేయడం గమనార్హం.

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాష్ రాజ్ ఘోరంగా ఓటమిని చవి చూడటంతో నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ ఓటమికి 100% నాగబాబే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా నాగబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే విష్ణు నుంచి మరి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.