మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. అతడితో పాటు అతడి ప్యానెల్ సభ్యులు కూడా ఘన విజయం సాధించారు. మా ఎన్నికల ముందు ఎంతో రచ్చ జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకున్నారు. ముగిసిన తర్వాత కూడా విభేదాలు తగ్గినట్లు కనిపించడం లేదు.
అందుకు ప్రకాష్ రాజ్, నాగబాబు, శివాజీ రాజా రాజీనామాలు చేశారు. అయితే మంచు విష్ణు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మీడియాతో ముచ్చటించారు. అతడు అక్కడ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అతడు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సమయంలో తనను ఎన్నికల నుంచి తప్పుకోమని చిరంజీవి చెప్పారని అన్నారు. ప్రకాశ్‌రాజ్ పోటీలో ఉన్నాడు కదా, విష్ణుని పోటీ నుంచి తప్పుకోమని చెప్పొచ్చు కదా అని మోహన్ బాబుకు చిరంజీవి చెప్పారని మంచు విష్ణు పేర్కొన్నారు.
కానీ ఎట్టి పరిస్థితిలో ఎన్నికలు జరగాల్సిందే అని నాన్న , తాను అనుకోవడం వల్లనే పోటీలో నిల్చున్నానని మంచువిష్ణు తెలిపారు. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టం అని.. అతడు తనకు మంచి మిత్రుడు అని.. అతడు తనకు ఓటు వేయలేదనే విషయం తనకు తెలుసు అని చెప్పాడు.
చిరంజీవి మాట ఎప్పుడు రామ్ చరణ్ తప్పడు.. వాళ్ల నాన్న మాట అంటే అతడు అంతాలా పాటిస్తాడు.. అలాగే తాను కూడా నాన్న మాటను జవదాటను అంటూ చెప్పాడు. అందుకు నాన్న తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నాగబాబు రాజీనామాను తాను ఆమోదించనని.. ఆ రాజీనామాను ఉపసంహరించుకోవాలని అతడు కోరాడు. గెలుపోటములు సహజం అని.. ఆయన అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…