కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా సినీ పరిశ్రమని షేక్ చేసిన నటి శ్రీయ శరన్. తెలుగులోనే కాదు.. సౌత్ ఇండియా లెవల్లో తన అందాలతో ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.
అందం, అందుకు తగ్గ అభినయం కనబర్చి ఎందరో అభిమానులను కూడగట్టుకున్న ఈ బ్యూటీ. తర్వాత కొంతకాలంగా సరైన అవకాశాలు రాకా ఆమె వెండితెరపై కనిపించలేదు. తర్వాత 2018 సంవత్సరంలో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్ళాడి సినిమాలకు ఇంకాస్త దూరం అయింది. సినిమాలకు దూరం అయినా సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటూ రొమన్స్ అప్ డేట్స్ ఇస్తూనే వస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా ఆమె ఓ పెద్ద సీక్రెట్ ను దాచి పెట్టింది. అదేంటంటే.. 2020 లాక్‌డౌన్ సమయంలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వగా.. ఆ విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టారు. తాజాగా అభిమానులతో ఆ విషయాన్ని పంచుకున్నారు. అసలు తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీయా.. అసలు ఇంతకాలం ఈ వార్తను ఎలా దాచి పెట్టిందిని అంతా షాక్ అవుతున్నారు. 2020 ప్రపంచం అంతా స్థంభించిపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే కోవిడ్ కారణంగా ఆగిపోయారు.
ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కరోనాతో ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ తమ జీవితంలో మాత్రం అద్భుతం జరిగిందని తెలిపింది శ్రీయ. ఆ బేబీకి సంబంధించిన ఫొటోలు, తన చిన్నారితో ఆడుకుంటున్న వీడియోని పోస్ట్ చేశారు. ఈ మధ్యే మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో ఉంటున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గన్ భార్యగా నటిస్తుంది శ్రీయ.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…