Latha Mangeshkar: గాన కోకిల లతా మంగేష్కర్ స్వరం నుంచి జాలువారిన..! మోస్ట్ రొమాంటిక్ 10 పాటలు ఇవే.. !

Latha Mangeshkar: గాన కోకిల మూగబోయింది..! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన లతామంగేష్కర్..!

Latha Mangeshkar: ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచారు. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Latha Mangeshkar: గాన కోకిల మూగబోయింది..! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన లతామంగేష్కర్..!
Latha Mangeshkar: గాన కోకిల మూగబోయింది..! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన లతామంగేష్కర్..!

గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరగా.. కరోనా నుంచి తర్వాత ఆమె కోలుకున్నారు. అయినా కొన్నాళ్ల వరకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆమె కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.

Latha Mangeshkar: గాన కోకిల మూగబోయింది..! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన లతామంగేష్కర్..!

అయితే తర్వాత ఆమెకు మళ్లీ అస్వస్థతకు గురి కాగా.. మళ్లీ వెంటిలేటర్‌ మీదే చికిత్స అందించారు. ఇలా ఆమె ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఇక ఆమె మరణం పట్ల ఎంతో మంది సినీ ప్రముఖులు, గాయకులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. దీనిలో భాగంగా.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా తన సంతాపం ప్రకటించారు.

ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం..

భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాల పాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అని అన్నారు. ప్రముఖ గాయినిగా 980 సినిమాలకు, 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. లతా 1940లలో బాలీవుడ్‌లోకి కాలుమోపారు. మొదట్లోనే ఎన్నో అవమానాలు. వాయిస్ బాగాలేదని తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1942లో లతకు తొలిసారిగా మంగళగౌర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. లత 1942లో మరాఠీ చిత్రం ‘కితీ హాసిల్’ లో ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేసింది. తెలుగులో 1955 లో ఏఎన్నార్‌ ‘సంతానం’ కోసం నిదుర పోరా తమ్ముడా..అనే పాటతో అరంగేట్రం చేశారు. అతి తక్కువకాలంలోనే తన ప్రతిభతో ఉన్న శిఖరాల్ని అధిరోహించారు.