Divorce: విడాకుల బాటలో మరో జంట..! జేడీ చక్రవర్తి సంచలన నిర్ణయం..!
Divorce: ఇటీవల కాలంలో సెలబ్రెటీ జంటల్లో విడాకులు కామన్ అయిపోతున్నాయి. నాగచైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకున్నారు. ఈ వ్యవహారం టాలీవుడ్ తో పాటు ఇతర ఫిలిం ఇండస్ట్రీల్లో కూడా ఈ విడాకుల వ్యవహారం చర్చనీయాంశం అయింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు.. నాలుగేళ్ల తమ అన్యోన్య బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. భేదాభిప్రాయాలతో సమంత-నాగచైతన్య విడిపోయారు. ఈ విషయం వీరిద్దరి ఫ్యాన్స్ ను కూడా బాధపెట్టింది.
ఇదిలా ఉంటే ఇటీవల మరికొన్ని జంటలు కూడా విడాకులు తీసుకున్నాయి. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షన్ అమీర్ ఖాన్- కిరణ్ రావు తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. తాజాగా టాలెంటెడ్ యాక్టర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ కూడా విడాకులు తీసుకున్నారు. శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా కూడా విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మరో సెలబ్రెటీ జంట విడిపోయింది. జేడీ చక్రవర్తి-అనుకృతి గోవింద్ విడాకులు తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జేడీ చక్రవర్తి… హీరోగా, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. అయితే 2016 లో లక్నోకు చెందిన అనుకృతి గోవింద్ ను వివాహం చేసుకున్నాడు. అనుకృతి గోవింద్ కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయే. రామ్ గోపాల్ వర్మ ‘ శ్రీదేవి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా ద్వారానే జేడీ చక్రవర్తి, అనుకృతి గోవింద్ మధ్య స్నేహం కుదిరింది. అది ప్రేమగా మారి.. తరువాత పెళ్లి చేసుకున్నారు. ఇలా టాలీవుడ్ జంటలు విడిపోవడం సగటు ప్రేక్షకుడికి ఆందోళన కలిగిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…