దర్శకుడిగా మారిన కొడుకును చూసి.. అతని విజయాన్ని మాత్రం చూడలేకపోయిన ఆ డైరెక్టర్ తల్లి!

బీటెక్ పూర్తిచేసిన కొరటాల శివ.. 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. కొరటాల శివ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల 2013లో ప్రభాస్ హీరోగా మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

తొలి సినిమాతోటే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. ఆ సినిమా ప్ర‌భాస్ కెరీర్‌లో అప్ప‌టికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో కొరటా శివ వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొరటాల చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే.

ఇక్కడ విషాదం ఏంటంటే.. దర్శకుడిగి మారిన శివను తన తల్లి చూడకుండానే చనిపోయారు. 1985లో తన తండ్రిని కోల్పోయిన శివ.. తల్లే అన్నీ తానై పెంచింది. రైట‌ర్‌గా శివ.. 2002 లో గర్ల్‌ఫ్రెండ్ కు రాశాడు. తర్వాత భద్ర, మున్నా, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, 2011 లో ఊసరవెల్లి వంటి వాటికి రచయితగా పని చేశారు. ఈ విజయాలను కళ్లారా చూశారు శివ తల్లి.

దర్శకుడిగా మిర్చి సినిమా చేస్తున్నప్పడు ఆ తల్లి ఎంతో సంతోషించారు.. కానీ ద‌ర్శ‌కుడిగా అత‌డు సాధించిన విజ‌యాన్ని క‌ళ్లారా చూసి.. ఆనందించ‌కుండానే ఆ త‌ల్లి క‌న్నుమూసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యలోనే ఆమె కన్నుమూశారు. ఆమెలేని లోటు పూడ్చలేనిదంటూ కొరటాల శివ ఎన్నోసార్లు కంటతడి పెట్టుకున్నారు. తన జీవితంలో ఇదొక్కటే వెలితి అంటూ చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు కొరటా శివ.