బీటెక్ పూర్తిచేసిన కొరటాల శివ.. 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. కొరటాల శివ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల 2013లో ప్రభాస్ హీరోగా మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.
తొలి సినిమాతోటే బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆ సినిమా ప్రభాస్ కెరీర్‌లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో కొరటా శివ వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొరటాల చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే.
ఇక్కడ విషాదం ఏంటంటే.. దర్శకుడిగి మారిన శివను తన తల్లి చూడకుండానే చనిపోయారు. 1985లో తన తండ్రిని కోల్పోయిన శివ.. తల్లే అన్నీ తానై పెంచింది. రైటర్‌గా శివ.. 2002 లో గర్ల్‌ఫ్రెండ్ కు రాశాడు. తర్వాత భద్ర, మున్నా, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, 2011 లో ఊసరవెల్లి వంటి వాటికి రచయితగా పని చేశారు. ఈ విజయాలను కళ్లారా చూశారు శివ తల్లి.
దర్శకుడిగా మిర్చి సినిమా చేస్తున్నప్పడు ఆ తల్లి ఎంతో సంతోషించారు.. కానీ దర్శకుడిగా అతడు సాధించిన విజయాన్ని కళ్లారా చూసి.. ఆనందించకుండానే ఆ తల్లి కన్నుమూసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యలోనే ఆమె కన్నుమూశారు. ఆమెలేని లోటు పూడ్చలేనిదంటూ కొరటాల శివ ఎన్నోసార్లు కంటతడి పెట్టుకున్నారు. తన జీవితంలో ఇదొక్కటే వెలితి అంటూ చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు కొరటా శివ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…