TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!

TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!

TDP-Congress: రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులు, మిత్రులు ఉండరని చాలా సార్లు పెద్దలు చెబుతుంటారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాటను చెబుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మొదటి నుంచి కూడా టీడీపీ, కాంగ్రెస్ ఒకరినొకరు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉన్నాయి.

TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!
TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!

2019లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా బద్ద శత్రువులుగా భావించిన ఈ రెండు పార్టీలు కలిసి పోయి మరీ పోటీ చేశాయి. ఇక ఇదే తరహా పంథాను త్వరలో అండమాన్ నికోబార్‌లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి.

TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!

ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ పోర్టు బ్లెయిర్‌లో గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు.

ఎవరేం చేసినా అభివృద్ధి కోసమే అని..

ఈ నేపథ్యంలో ఈ విషయాలను వెల్లడించారు. అండమాన్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఇక ఈ పొత్తులో భాగంగా మున్సిపాలిటీలోని వార్డులను పంచుకున్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఏ పార్టీ నుంచి చేయాలనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నారు. ఇక్కడ వచ్చేనెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.. మార్చి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే సమావేశంలో రంగలాల్ హల్దార్ మాట్లాడుతూ.. ఎవరేం చేసినా అభివృద్ధి కోసమే అని.. ప్రజాస్వామ్యయుత పాలన కోసం తాము టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బరిలో దిగనున్నామన్నారు. తమను ప్రజలు ఆదరించాలని కోరారు.