హీరో సిద్ధార్థ్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలివే!

హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో తెలుగు, తమిళ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ్ గా పరిచయమైన ఈ నటుడి పూర్తి పేరు సిద్ధార్థ్ సూర్యనారాయణ. తమిళ నాడు చెన్నైలో జన్మించిన సిద్ధార్థ్ చదువులో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేశారు. 2002వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్ మొట్టమొదటిసారిగా డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ పనిచేస్తూ తన కెరియర్ ను ప్రారంభించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నటుడిగా మాత్రమే కాకుండా సింగర్, నిర్మాతగా కూడా బాధ్యతలను వ్యవహరించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “బాయ్స్” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”, “బొమ్మరిల్లు” వంటి చిత్రాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

హీరో సిద్ధార్థ్ 2002వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన సిద్ధార్థ్ ఆ తర్వాత వరుస ఫ్లాపులను చవి చూడటంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అయ్యారు. తాజాగా ఈ హీరో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి “మహా సముద్రం” సినిమా ద్వారా హీరో శర్వానంద్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.