Health News

కడుపులో సమస్యలకు కారణాలు ఇవే.. వాటి నివారణకు ఇలా చేయండి.. !

ఆధునికజీవనశైలిలో భాగంగా ఉరుకులు పరుగుల జీవితం గడపడం.. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం.. వంటి కారణాలతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపుడుతున్నారు. గ్యాస్ కు సంబంధించి వ్యాధుల బారినపడి ఎంతో మానసికంగాను, శారీరకంగానూ ఇబ్బందులకు గురవుతున్నారు.

కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. ఇలా తినే తిండి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా జీర్ణప్రక్రియ సక్రమంగా జరగాలంటే మన శరీరం ఎంజైమ్ లను విడుదల చేస్తుంది. అవి విడుదల కాకుండా కొన్ని పదర్థాలు అడ్డుపడుతూ ఉంటాయి. దీని వల్ల కూడా కడుపులో నొప్పి మొదలవుతుంది. ఉడికించని ఆహారం తీసుకున్నా.. ఉడికించని మాంసం తిన్నా కూడా ఈ సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది.

ఈ సమస్య గనుక ఎదురైతే.. కాఫీ, టీ లాంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య వస్తుందని అంటున్నారు వైద్యులు. ఇంట్లోనే ఎక్కువగా వండుకొని తినడం మంచిదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం రైతులు పండించే ఆహారంలో తీవ్రంగా కెమికల్స్ ఉంటున్నాయి.

వాటి ద్వారా వచ్చిన కూరగాయలు, పండ్లను సరిగ్గా కడుక్కోకుండా తింటే మాత్రం జీర్ణవ్యవస్థ సమస్యలు కూడా వస్తాయి. సమయానికి ఆహారం తీసుకోవాలి. కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి. ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. తిన్న రెండు గంటల తర్వాత నిద్రించాలి. ఇలాంటివి పాటిస్తే కడుపులో నొప్పి, మంట లాంటివి దూరం అవుతాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago