ఆధునికజీవనశైలిలో భాగంగా ఉరుకులు పరుగుల జీవితం గడపడం.. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం.. వంటి కారణాలతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపుడుతున్నారు. గ్యాస్ కు సంబంధించి వ్యాధుల బారినపడి ఎంతో మానసికంగాను, శారీరకంగానూ ఇబ్బందులకు గురవుతున్నారు.

కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. ఇలా తినే తిండి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా జీర్ణప్రక్రియ సక్రమంగా జరగాలంటే మన శరీరం ఎంజైమ్ లను విడుదల చేస్తుంది. అవి విడుదల కాకుండా కొన్ని పదర్థాలు అడ్డుపడుతూ ఉంటాయి. దీని వల్ల కూడా కడుపులో నొప్పి మొదలవుతుంది. ఉడికించని ఆహారం తీసుకున్నా.. ఉడికించని మాంసం తిన్నా కూడా ఈ సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది.
ఈ సమస్య గనుక ఎదురైతే.. కాఫీ, టీ లాంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య వస్తుందని అంటున్నారు వైద్యులు. ఇంట్లోనే ఎక్కువగా వండుకొని తినడం మంచిదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం రైతులు పండించే ఆహారంలో తీవ్రంగా కెమికల్స్ ఉంటున్నాయి.
వాటి ద్వారా వచ్చిన కూరగాయలు, పండ్లను సరిగ్గా కడుక్కోకుండా తింటే మాత్రం జీర్ణవ్యవస్థ సమస్యలు కూడా వస్తాయి. సమయానికి ఆహారం తీసుకోవాలి. కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి. ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. తిన్న రెండు గంటల తర్వాత నిద్రించాలి. ఇలాంటివి పాటిస్తే కడుపులో నొప్పి, మంట లాంటివి దూరం అవుతాయి.




























