డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు తీపి తినాలనిపిస్తే.. వీటిని ఏంచక్కా తినేయొచ్చు..!

ప్రస్తుతం ప్రతీఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా మంచిదే. ఆ వ్యాధులను తగ్గే అవకాశం కూడా ఉంది. అయితే దానిలో భాగంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి డైట్ చార్ట్ ను సిద్దంచేసుకోవడంలో అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆందోళనా లేకుండా అనుసరించగల ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీరికి తీపి తినాలనిపించినపుడు స్వీట్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్స్‌ తినవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న రోగులకు పండ్లు సురక్షితమైనవి కావు అనే భావన పూర్తిగా అవాస్తవం. కొన్ని పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అత్యుత్తమంగా సహాయపడుతాయి.

అవేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం.. మొదటిది గ్రేప్ ఫ్రూట్. దీనిలో 91 శాతం నీరు ఉంటుంది. విటమిన్ సి నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు రోజూవారీ క్రమంలో భాగంగా గ్రేప్ ఫ్రూట్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రెండోది.. స్ట్రాబెర్రీస్ కూడా దీనిని నియంత్రించడానికి సహాయపడే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ తో లోడ్ చేయబడి ఉంటాయి.

ఆరెంజ్ లో కూడా విటమిన్ సి మరియు థయామిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండటం మూలంగా చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆపిల్, బొప్పాయి, ఉసిరి, దానిమ్మ, ఫైనాపిల్, అవగాడో , పుచ్చకాయలు, డ్రాగన్‌ ఫ్రూట్‌, పీయర్స్‌ వంటి పండ్లల్లో చెక్కర స్థాయిని నియంత్రించే విటమిన్లు ఉంటాయి.