రూ.500 కోట్లతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్.. చివరకు ఇలా తిహార్ జైలులో.. సుఖేశ్ చంద్రశేఖర్ కేసులో కొత్త విషయాలు..!

న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెస్ ఎక్కువగా సుఖేశ్ చంద్రశేఖర్ విషయంలో హైలెట్ గా మారుతోంది. జైలు శిక్ష అనుభవిస్తున్న రాన్‌బాక్సీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు ఈ జంట ఇప్పటికే ఢిల్లీ పోలీసుల అదుపులో ఉండి జైలులో ఉన్నారు. చంద్రశేఖర్ ప్రభుత్వ అధికారిలా నటించి తన భర్తకు బెయిల్ ఇప్పిస్తానంటూ అదితి నుంచి రూ. 200 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో సుఖేశ్‌తో పాటు ఈ మోసంలో ఇన్వాల్వ్ అయిన త‌న భార్య లీనా మారియాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డిని తీహార్ జైలుకు త‌ర‌లించారు. ఇలా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ కేసుకు సంబంధించి రోజురోజుకు కొత్త వివరాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సుకేష్ ఆమెకు విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇవ్వడమే కాకుండా.. జాక్వెలిన్ నటించిన వరుస చిత్రాలను నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. రూ. 500 కోట్లతో మూడు భాగాల మహిళా సూపర్‌హీరో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తానని సదరు మోసగాడు ఆ నటితో చెప్పినట్లుగా సమాచారం.

ఆమె ఇటీవల ఏ చిత్రాన్ని కూడా ఒప్పుకోలేదు. దీంతో ఆమెను ఎలాగైనా తన సినిమాలకు ఒప్పించడానికి ఓ మాస్టర్ ప్లాన్ లాంటిది వేశాడు. ఇలా అతడు .. హాలీవుడ్ VFX ఆర్టిస్టులు పాల్గొనే భారతదేశపు మొదటి మహిళా సూపర్ హీరో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తానని.. అది ప్రపంచ స్థాయిలో చిత్రీకరించబడుతుందని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఆమెను పొగడ్తలతో మొంచెత్తాడు. ఆమె హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీని పోలి ఉందని చెప్పాడు. అయితే ఆమె తీసిన సినిమాను పోలి ఉండే విధంగా మనం కూడా తీద్దామని అతను జాక్వెలిన్‌తో చెప్పాడట. ఆమెను ఒప్పించడానికి పరిశ్రమ నుండి ముఖ్యమైన వ్యక్తులను పేర్లు కూడా చెప్పాడట.

ఇలా అతడు చెప్పిన మాటలకు ఆమె పడిపోయింది. ఇక ఈ మోసగాడు సినిమా బడ్జెట్‌లు.. నిర్మాణంపై బాగా సిద్ధమయ్యాడు.సుఖేశ్ తీహార్ జైలులో ఉన్న‌ప్పుడు జాక్వెలిన్ త‌రుచూ అత‌డిని క‌ల‌వ‌డానికి జైలుకు కూడా వెళ్లేద‌ని తెలుస్తోంది. దాని కారణంగానే జాక్వెలిన్ కు కూడా ఈడీ సమన్లు జారీ చేసి విచారించింది. ఈ రూ. 200 కోట్లలో .. అతడు తనకు లక్షా యాభై వేల డాలర్లు మాత్రమే పంపించాడని స్పష్టం చేసింది. తన సోదరికి లక్షా ఎనభై వేల డాలర్లు పంపించినట్లు ఆమె ఈడీ విచారణలో ఒప్పుకుంది. ఇక ఇలాంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన అతడు ఎన్నో చేశాడని ఈడీ విచారనలో వెల్లడైంది. అంతే కాదు అతడు జైలులోనే ఉంటూ.. అక్కడ ఉన్న వారికి నెలకు రూ.కోటి ఇస్తూ విలాసవంతమైన సౌకర్యాలు కూడా అనుభవించినట్లు సమాచారం.