Featured

ఇంటర్వ్యూ మధ్యలో లేచి వెళ్లిపోయిన సిరి.. వాటి గురించి అడగొద్దంటూ సీరియస్..!

తెలుగులో బిగ్ బాస్ 5 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. ఇక టాప్ 5 స్థానాన్ని సంపాదించుకున్న సిరి మొదట ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత మానస్ వెళ్లాడు. టాప్ 3 నుంచి శ్రీరామచంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. చివరకు సన్నీ, షణ్ముక్ మధ్యలో చివరకు ఈ టైటిల్ కు సన్నీకి వరించింది. షణఖ్ రన్నరప్ గా నిలిచాడు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన సిరి ఇంటర్వ్యూలో బిజీ అయ్యారు.

ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లారంటే.. మొదట తన పేరు శిరీష అని.. కానీ తనకు సిరి అని పిలిపించుకోవడం ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ అవకాశం గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 2లో వెళ్లాల్సి ఉంది.. కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు అని చెప్పుకొచ్చింది. చివరకు బిగ్ బాస్ సీజన్ 5కు అవకాశం వచ్చిందని చెప్పింది. మొదట మిగతా కంటెస్టెంట్ తో పోల్చుకంటే.. విన్నర్ అవ్వాలని అనుకోలేదని.. కానీ టాప్ 5లో ఉండాలని అనుకున్నా అని చెప్పారు.
షణ్ముఖ్ విన్నర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు.. అని అడగ్గా.. అతడు తన ఫ్రెండ్ అని.. అతడు తనకు బాగా సపోర్ట్ చేశాడని అందుకే అతడు విన్ అవ్వాలని కోరుకున్నానన్నారు.

జెస్సీ మరి కొన్ని వారాలు ఉంటే బాగుండేదని అన్నారు. శ్రీహాన్ వచ్చి నన్ను వదిలేస్తున్నావా అని అడిగినప్పుడు.. మీరేమనుకున్నారని అడగ్గా.. అతడు నన్నుమిస్ అవుతున్నాడు అని అనిపించిందన్నారు. ముఖ్యంగా తన తల్లి వచ్చి హగ్గులు చేసుకోవద్దు అని చెప్పగానే కొద్దిగా బాధ పడ్డడానని.. తర్వాత కూడా అతడితో కనెక్ట్ అయ్యాయనని… నేను ఎలా ఉండాలో అలానే ఉన్నాన్నారు. తల్లి వచ్చి చెప్పిన తర్వాత ఒకలా.. తర్వాత ఒకలా నేను లేనని.. నేను నాలాగే ఉన్నానని.. ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లితో అర్థం అయ్యేవిధంగా చెప్పానన్నారు.

ఇక హగ్గుల గురించి మాట్లాడుతూ.. హగ్గుల వల్లనే మీకు నెగెటివిటీ వచ్చిందని.. దీనిపై మీరు ఏమంటారని అడగ్గా.. ఫ్రెండ్ షిప్ వేరు.. లవ్ వేరు అని చెప్పారు. తమ మధ్య మంచి బాండ్ ఉందని.. ఎమోషనల్ గా మాత్రమే కనెక్ట్ అయ్యామని.. దానిని బ్యాడ్ వేలో తీసుకోవద్దని చెప్పారు. దీనిపై ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పుకున్నారని.. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్వ్యూయర్ హగ్గుల గురించే మళ్లీ మళ్లీ అడుగుతుండగా.. కోపంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ వచ్చి ఇంటర్వ్యూని కంటిన్యూ చేశారు. ఏదేమైనా.. బయటకు వచ్చిన తర్వాత తనపై నెగెటివిటీ బాగా స్ప్రెడ్ అయిందని సిరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

24 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

24 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

24 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago