Yendamuri Veerendranath: పెద్ద వారి ఇండ్లలో డ్రగ్స్, డివోర్స్ రావడానికి కారణం ఇదే: యండమూరి

Yendamuri Veerendranath: పెద్ద వారి ఇండ్లలో డ్రగ్స్, డివోర్స్ రావడానికి కారణం ఇదే: యండమూరి

Yendamuri Veerendranath: వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా, నవలా రచయితగా ఎంతో మంచి గుర్తింపు పొందిన యండమూరి గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసిన యండమూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రస్తుత కాలంలో పెద్ద వారి ఇళ్లలో అమ్మాయిలు డ్రగ్స్ కి అలవాటు పడటం, విడాకులు తీసుకోవడం గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.

Yendamuri Veerendranath: పెద్ద వారి ఇండ్లలో డ్రగ్స్, డివోర్స్ రావడానికి కారణం ఇదే: యండమూరి
Yendamuri Veerendranath: పెద్ద వారి ఇండ్లలో డ్రగ్స్, డివోర్స్ రావడానికి కారణం ఇదే: యండమూరి

ఈ సందర్భంగా ఆడపిల్లల గురించి ఆయన మాట్లాడుతూ ఒకానొక సమయంలో ఆడపిల్ల అంటే పట్టు పరికిని ధరించి ఎంతో చక్కగా ముస్తాబై పువ్వులు పెట్టుకుని ఉండే వాళ్ళు. అయితే జనరేషన్ మారుతున్న కొద్దీ అమ్మాయిల వస్త్రధారణలో అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయని ఆయన తెలియజేశారు. పెద్ద వారి ఇండ్లలో ఉండే ఆడపిల్లలను ఎక్కువగా గారాబం చేయటం వల్ల వాళ్ళు ఒక యుక్తవయసుకు రాగానే ఎక్కువగా ఫ్రెండ్స్ పార్టీ అంటూ ఎంజాయ్ చేస్తారు.

Yendamuri Veerendranath: పెద్ద వారి ఇండ్లలో డ్రగ్స్, డివోర్స్ రావడానికి కారణం ఇదే: యండమూరి

ఈ విధంగా ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కి వెళ్లడం, పార్టీలు చేసుకోకపోవడం,డ్రగ్స్ తీసుకోకపోవడం వంటివి చేయటం వల్ల అదొక చిన్నతనంగా భావిస్తారు. అందుకే తప్పకుండా చాలామందికి డ్రగ్స్, మందు-సిగరెట్ వంటి అలవాట్లు ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఇక పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయికి ఉండే ఇలాంటి అలవాట్లు పూర్తిగా మార్చుకోవలసి వస్తుంది.

అసౌకర్యంగా ఉంటారు…

అమ్మాయి గర్భవతి అయినప్పుడు లోపల ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించి సిగరెట్ మందు డ్రగ్స్ వంటి వాటిని దూరం పెడతారు.అదే సమయంలో తన తోటి స్నేహితులు ఇంకా పెళ్లి కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటే వారీలో ఒక అసౌకర్యమైన భావన కలుగుతుంది. తాను అలాంటి ఎంజాయ్ మెంట్ కు దూరం అయ్యాననే భావన వారిలో ఏర్పడుతుంది. ఇలా చాలా మందిలో ఇలాంటి భావన ఏర్పడటం వల్ల గొడవలు అవ్వడం విడాకుల వరకూ వెళ్లడం జరుగుతున్నాయని ఈ సందర్భంగా యండమూరి వెల్లడించారు.