Actor Nagesh Karra: ప్రముఖ టీవీ నటుడిగా పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగేష్ కర్ర పలు సినిమాలలో కూడా నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా ఆచార్య సినిమాలో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రస్థానం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య సినిమాలో తనకు మంచి పాత్ర ఇచ్చారని ఆ పాత్రలో నటించిన తర్వాత ఇదివరకు సినిమాలలో నన్ను రిజెక్ట్ చేసిన వారు కూడా ఫోన్ చేసి చాలా అద్భుతంగా నటించారు అంటూ మెచ్చుకున్నారని నాగేష్ వెల్లడించారు. ఇక ఈయన వెండితెరపై బుల్లితెరపై కూడా నటించారు. రెండింటిలో ఏది గొప్ప అంటే దేని ప్రాధాన్యత దానికి ఉంటుందని నాగేష్ తెలిపారు.
ఇక మీరు ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. ఆచార్య సినిమాలో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్, కాజల్ వంటి వాళ్ళు నటించిన చివరికి ఆ పాత్రను తీసేసారు. అలా మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా అనే ప్రశ్న ఎదురైంది.
సాధారణంగా సినిమాలో సినిమాకు అవసరమయ్యే పాత్రలను తప్పనిసరిగా పెడతారు. వారికి అనవసరం అనుకుంటే ఆ క్యారెక్టర్స్ అన్నింటిని తీసేయడం సర్వసాధారణం. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని ఈ సందర్భంగా నాగేశ్ వెల్లడించారు. ఒక సినిమాలో బ్రహ్మానందంతో కలిసి నా పాత్ర చాలా పెద్ద ట్రాక్ అని, అందులో బ్రహ్మానందం గారు ఒక కంపెనీ సీఈఓ అయితే, ఆయనకు సపోర్టింగ్ క్యారెక్టర్ లో నేను నటించాను. అయితే ఈ సినిమాలో ప్రొడ్యూసర్ కి బ్రహ్మానందానికి గొడవ ఉండటంవల్ల ఆయన ట్రాక్ మొత్తం లేపేసారు. అందులో నా పాత్ర కూడా పోయిందని ఈ సందర్భంగా నాగేష్ సినిమాల గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…