Karate Kalyani: కరాటే కళ్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు..?
Karate Kalyani: నటి కరాటే కళ్యాణి గత రెండు రోజుల నుంచి పెద్దఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఈమె వార్తల్లో నిలవడానికి గల కారణం యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకోవడమే కారణమని చెప్పాలి.శ్రీకాంత్ రెడ్డి రోడ్డుపై వెళ్లే మహిళలతో ఎంతో అసభ్యకరంగా ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారంటూ ఈమె అతనితో గొడవ పడింది.
ఈ క్రమంలోనే పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఇద్దరు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఇద్దరికీ ఒకే రకమైన కేసు పెట్టడంతో ఎస్.ఆర్.నగర్ సైదులు పై ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిత్యం వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉండగా తాజాగా కరాటే కళ్యాణి ఇంటిలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తో గొడవ పడుతున్న సమయంలో ఆమె చేతిలో చంటిబిడ్డ ఉండడం గమనార్హం.ఈ క్రమంలోనే ఆ బిడ్డ ఎవరు అతనికి ఏమవుతుందని అనుమానాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటిని సోదా చేసి చిన్నారిని గుర్తించారు. అయితే ఆ చిన్నారి ఎవరు? తనకు కరాటే కళ్యాణికి సంబంధం ఏమిటి?తనని కరాటే కళ్యాణి ఎక్కడి నుంచి తీసుకు వచ్చింది అంటూ పెద్దఎత్తున అధికారులు ఆరా తీస్తున్నారు.కరాటే కళ్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు తన ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…