Thripuraneni Chittibabu : తప్పంతా నిఖిల్ దే… దిల్ రాజు నిఖిల్ మధ్య జరిగింది ఇదే : ప్రొడ్యూసర్ చిట్టిబాబు

Thripuraneni Chittibabu : కార్తీకేయ-2 సినిమా విడుదల సందర్బంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ మా సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు అంటూ నేను బాగా ఏడ్చాను అంటూ మాట్లాడటంతో అందరూ దిల్ రాజు వల్లే ఇలా జరిగిందటూ, తొక్కేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. యూట్యూబ్ లోనూ ఈ ఇష్యూ పై బాగా వీడియోస్ వచ్చాయి. ఇక సినిమా సక్సెస్ మీట్ కు దిల్ రాజు వచ్చి నేనెవరిని సినిమాను తొక్కేయడానికి నిజాలు తెలుసుకొని రాయండి తెలియకపోతే మూసుకోండి అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఇష్యూ గురించి నిర్మాత చిట్టిబాబు మాట్లాడారు.

నిఖిల్ స్పష్టంగా చెప్పలేదు…

సినిమా విడుదల సమయంలో కార్తికేయ సినిమా ప్రొడ్యూసర్ తో చర్చించి దిల్ రాజు గారు థాంక్యూ, కనెమ విడుదల ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకోమని అడిగాడట. దీనికి నిర్మాత కూడా ఒప్పుకోవడంతో వారం రోజులు వాయిదా వేసారు. ఆ వారం తరువాత కూడా వేరే సినిమాలు ఉండటంతో ఇంకోసారి వాయిదా వేసుకోండి అని చెప్పారట, అయితే మీ ఇష్టం అని చెప్పారట. ఇక చిత్ర దర్శకుడు, నిర్మాత, హీరో నిర్ణయించుకుని ఆగష్టు 13న విడుదల చేసారు. దిల్ రాజు నిర్మాత మాత్రమే కాకుండా సినిమా థియేట్వర్లను కూడా పెట్టుకోవడం వల్ల తనకు నచ్చిన సినిమాలకు థియేటర్లను ఇస్తారు అలా సినిమాలను కంట్రోల్ చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం సినిమా సరిగా ఆడకపోయినా కార్తికేయ సినిమాకు థియేటర్స్ ఇవ్వడానికి దిల్ రాజు ఒప్పుకోకపోవడం కార్తికేయ సినిమా వాళ్లకు నచ్చకపోయి ఉండొచ్చని చిట్టిబాబు అభిప్రాయ పడ్డారు. అయితే ఇక్కడ అయన ఆలోచన ఏంటో తెలియదు కదా వచ్చే ఆ కొంచెం వసూల్లనైనా రాబట్టుకోవాలని అనుకోని ఉండవచ్చు. థియేటర్లు అయనవి కనుక ఆయనకు నచ్చినట్టు చేసాడు.

అయితే నిఖిల్ మొదటి సారి సినిమా వాయిదా పడినపుడు ఏడ్చాను మా సినిమాను విడుదల అవ్వనివ్వడం లేదు అని చెప్పాడు కానీ ఎవరు చేసారు, ఏమి జరిగింది అనే విషయాలు క్లారిటీ గా చెప్పి ఉంటే బాగుండేది, తప్పు అతనిది కూడా అంటూ చిట్టీ బాబు అభిప్రయపడ్డారు. ఇండస్ట్రీ లో నాలుగు సినిమాలు ఒకే సమయానికి విడుదల అవుతున్నాయంటే నిర్మాతలు చర్చించుకుని సర్దుబాటు చేసుకోవడం మామూలే కానీ థియేటర్ల పై ఆధిపత్యం పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ లో ఆధిపత్యం చేస్తూ అయన అనుకున్న సినిమాలను మాత్రమే విడుదల చేయానిస్తాను అంటే ఎలా అది తప్పు. ఇదే కాదు నిర్మాతల గిల్డ్ అంటూ షూటింగ్ బంద్ చేసే అధికారం ఎవరు ఇచ్చారు. ఇండస్ట్రీ అంటే దిల్ రాజు మాత్రమే కాదు. రన్నింగ్ ప్రొడ్యూసర్, వెయిటింగ్ ప్రొడ్యూసర్, ఇలాంటివి ఎమీ లేవు రెండు సినిమాలు హిట్ అయినంత మాత్రాన రన్నింగ్ ప్రొడ్యూసర్ అంటూ నువేం చేసినా జరుగుతుందని అనుకుంటే ఎలా. ప్రొడ్యూసర్ అంటే అందరు ప్రొడ్యూసర్స్ వస్తారు అంటూ చిట్టీ బాబు దిల్ రాజు పై మండిపడ్డారు.