Movie News

Imandi Ramarao : ఆస్కార్ రేస్ లో ఎన్టీఆర్… హాలీవుడ్ పెయిడ్ ప్రొమోషన్స్ అంటూ ట్రోల్ల్స్ చేస్తున్న వారిపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇమంది రామారావు..!

Imandi Ramarao : ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘కొమరం భీముడో’ పాత్రకు ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిలవబోతున్నాడు అంటూ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ప్రచురించిన కథనం. ఇక దీన్ని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఫేక్ అంటూ కొట్టిపారేస్తుంటే మరి కొంతమంది మంది మాత్రం ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తే ఇండియన్ సినిమాకు అది గర్వకారణం అంటూ మాట్లాడుతున్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా బాగా అలరించింది. ఆస్కార్ బరిలో ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమా ఏదో ఒక కేటగిరి లో అవార్డు సంపాదిస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంతున్నా నిజంగా ఒక తెలుగు యాక్టర్ కి అవార్డు వస్తే అందరూ గొప్పగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా ట్రోల్ల్స్ చేయడం ఏంటి అంటూ ఇమంది రామారావు గారు స్పందించారు.

హాలీవుడ్ లో పెయిడ్ ప్రొమోషన్స్…

ఒక హీరో గురించి కానీ, ఆర్టిస్ట్ గురించి కానీ మంచి విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే ఈ మధ్య కాలంలో యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న పని పెయిడ్ ప్రొమోషన్స్ అంటూ మాట్లాడటం. ఇదే పని ఎన్టీఆర్ విషయంలో కూడా చేస్తున్నారు. హాలీవుడ్ పత్రిక ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ ఉండే అవకాశం ఉంది అంటూ ఆసియా మొత్తానికి అతని పేరును ప్రచురిస్తే అది పెయిడ్ ప్రొమోషన్స్ అంటూ మాట్లాడటం మూర్ఖత్వంకు పరాకాష్ట. రేపటిరోజున నిజంగా ఆస్కార్ అవార్డు గనుక ఎన్టీఆర్ కి వస్తే అది కూడా కొనుక్కున్నాడు అని ట్రోల్ చేస్తారా… అంటూ ఫైర్ అయ్యారు.

‘బాల రామాయణం’ సమయం నుండి ఇప్పటి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్టీఆర్ ను చూస్తూ వస్తున్నాం, ఎంత పేరు తెచ్చుకున్నాడో అది కష్టపడితే వచ్చింది ఊరికే రాలేదు అంటూ మాట్లాడారు. అయినా ఆస్కార్ వచ్చినా రాకపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ కు వెళ్లే అర్హత ఉన్న నటుడు అంటూ తన పేరు వినపడింది కదా అది చాలు గొప్ప నటుడుని ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అంటూ చెప్పారు. ఇక ట్రోల్ల్స్ గురించి మాట్లాడుతూ ఇలా ఏ హీరో విషయం లో జరిగినా ఆక్షేపనీయం అని చెప్పారు. ఒక హీరోకి మంచి గుర్తింపు వస్తోందంటే ట్రోల్ల్స్ చేయడం, నెగెటివ్ కామెంట్స్ చేయడం ఏంటి, మన వాళ్లకు వచ్చిందని ఆనంద పడొచ్చుకదా అంటూ మాట్లాడారు. ఆస్కార్ ల విషయాల్లో కూడా కులం కార్డు తీయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago