Balakrishna: బాలకృష్ణ అంటే ఆయనకు చాలా కోపం ఎక్కువ, ఆయన తొందరగా అభిమానులపై చేయి చేసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పని ఎన్నోసార్లు ఈయన నిరూపించారు. బాలకృష్ణ మనసు చాలా మంచిదని ఆయన మనస్తత్వం ఎంతో సున్నితంగా ఉంటుందని బాలయ్య ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించారు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపూర్ లో పర్యటించారు.
ఈ క్రమంలోనే తన నియోజకవర్గంలోని ప్రజలు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏకంగా ఈయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అనే కార్యక్రమం ద్వారా మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ వాహనం ద్వారా దాదాపు 200 రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు ఉచిత నిర్వహించి మందులను కూడా ఉచితంగా ప్రజలకు సరఫరా చేయనున్నారు. ఈ క్రమంలోనే తన భార్య వసుంధరతో కలిసి ఈ ఆరోగ్య రథ వాహనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం అనంతరం బాలకృష్ణ హిందూపురంలోనే తన అభిమాని ఇంటికి వెళ్లి ఒక్కసారిగా ఆయనను సర్ప్రైజ్ చేశారు. ఇలా స్వయంగా అభిమాని ఇంటికి వెళ్లారంటే అతను టిడిపి నేతనో లేకుంటే బాలకృష్ణ అభిమాన సంఘాల నేత మాత్రం కాదు. ఒక సాధారణ బాలకృష్ణ అభిమాని మాత్రమే.ఇలా బాలకృష్ణ ఒక సాధారణ అభిమాని ఇంటికి తన హోదా పరపతి పక్కన పెట్టి ఆయన ఇంటికి వెళ్లి తనని సర్ప్రైజ్ చేశారు.
ఈ విధంగా బాలకృష్ణ ఆ ఇంటికి వెళ్లడానికి ఓ కారణముంది.బాలకృష్ణ హిందూపురంలో పర్యటించిన రోజు తన అభిమాని పుట్టినరోజు అని తెలుసుకోవడంతో బాలయ్య స్వయంగా ఆ ఇంటికి వెళ్లి తన అభిమానిని ఆశీర్వదించి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా బాలకృష్ణ స్వయంగా తన ఇంటికి వెళ్లి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో అసలు సిసలైన పుట్టినరోజు ఈరోజు అంటూ అభిమాని ఎమోషనల్ అవుతూ బాలకృష్ణకు శాలువా కప్పి సత్కరించారు.ఇక ఇది తెలిసిన అభిమానులు ఇదే కదా బాలయ్య అంటే అంటూ పెద్ద ఎత్తున అభిమాన హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…