Tollywood Actors Remuneration: పవన్ కళ్యాణ్ నుంచి విజయ్ దేవరకొండ వరకు టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Tollywood Actors Remuneration:ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు.అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడమే కాకుండా సినిమాలకు అనుగుణంగానే హీరోల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది.మరి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే….

ప్రభాస్: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఈయన స్పిరిట్ సినిమా కోసం ఏకంగా 150 కోట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్: త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 45 కోట్లు తీసుకున్నప్పటికీ తదుపరి కొరటాల సినిమా కోసం 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

రామ్ చరణ్: రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా కోసం 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రస్తుత సినిమాలకు ఈయన కూడా 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

అల్లు అర్జున్: పుష్ప సినిమా కోసం 40 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 కోసం 100 కోట్లు తీసుకోబోతున్నారని సమాచారం.

మహేష్ బాబు: ఈయన కేవలం తెలుగు సినిమాలను చేస్తూ ఒక్కో సినిమాకు 55 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ: లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయినప్పటికీ ఈ సినిమా నిరాశపరిచింది. ఇక విజయ్ ప్రస్తుత ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

Tollywood Actors Remuneration:

చిరంజీవి: సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి ఒక్కో సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

బాలకృష్ణ: బాలకృష్ణ అఖండ సినిమా కోసం 11 కోట్లు తీసుకున్నప్పటికీ వీరసింహారెడ్డి కోసం 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

వెంకటేష్, నాగార్జున: ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఒక్కో సినిమాకు ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.