Sreeleela: శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమా ద్వారా నటి శ్రీ లీల హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా ఈమె నటనతో అందచందాలతో ఎంతోమంది అభిమానులతో పాటు పలువురు దర్శక నిర్మాతలను కూడా ఆకట్టుకుంది. దీంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం శ్రీ లీల చేతిలో అరడజనుకు పైగా సినిమా అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మకు బడా బ్యానర్లో స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చింది. దీంతో డేట్స్ ఖాళీ లేకపోవడంతో శ్రీ లీల ఇదివరకే కమిట్ అయిన ఓ సినిమా నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే సదురు డైరెక్టర్ వద్దకు వెళ్లి తనకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని, ఆ కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని డైరెక్టర్ హీరోకి తెలియచేయడంతో ఆ హీరో సరాసరి శ్రీ లీలకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.ఈ సందర్భంగా ఆ హీరో ఫోన్ చేసి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలుదొక్కుకోవాలంటే ముందుగా మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉండాలి అని చెప్పారట.
ఇలా ఇచ్చిన మాట మీద నిలబడటం, అలాగే మనం చేసేపనికి 100% న్యాయం చేసినప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలబడగలమని లేదంటే అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా హీరో నటి శ్రీలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.మరి శ్రీ లీలా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…