Tollywood : ఒక్క సినిమాతో హిట్ కొడితే రెండవ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న యంగ్ డైరెక్టర్..

ఇప్పుడు ట్రెండ్ మారింది. యంగ్ డైరెక్టర్స్ బాగా సత్తా చాటుతున్నారు. చిన్న బడ్జెట్‌తో సినిమా చేసే అవకాశాన్ని పెద్ద నిర్మాణ సంస్థల నుంచే అందుకుంటున్నారు. సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్స్ షార్ట్ ఫిలింస్ తీసి టాలెంట్ చూపించుకొని సినిమా దర్శకుడిగా అవకాశం అందుకోవడం అంటే అది చాలా అదృష్ఠం. ఒకప్పుడు దర్శకుడిగా మొదటి సినిమా అవకాశం రావాలంటే ముందు పెద్ద దర్శకుల దగ్గర అప్రెంటీస్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా ఏళ్ళు కష్టపడాలి. ఆ తర్వాత కో డైరెక్టర్‌గా రెండు సినిమాలు లేదా మూడు సినిమాలైనా చేయాలి.

Tollywood : ఒక్క సినిమాతో హిట్ కొడితే రెండవ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న యంగ్ డైరెక్టర్..
Tollywood : ఒక్క సినిమాతో హిట్ కొడితే రెండవ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న యంగ్ డైరెక్టర్..

అప్పుడు గాని దర్శకుడిగా ఓ అవకాశం దక్కదు. దానికోసం ఎన్ని ఏళ్ళు ఎదురుచూడాలో అప్పటి దర్శకులకు తెలుస్తుంది. ఇక దర్శకుడయ్యాక ఓ హిట్ కొడితే పెద్ద బ్యానర్‌లో వరుసగా సినిమా అవకాశాలు దక్కేవి. పగలు రాత్రి సినిమా కోసం కష్టపడిన దాసరి నారాయణ రావు, ఏ కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ లాంటి వారున్నారు. రాత్రికి రాత్రి సీన్స్ పూర్తి చేసిన సందర్భాలు అప్పట్లో ఎన్నో ఉన్నాయి. శత చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కోడి రామకృష్ణ వరుసగా ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారో ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది.

Tollywood : ఒక్క సినిమాతో హిట్ కొడితే రెండవ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న యంగ్ డైరెక్టర్..

ఓ హిట్ రాగానే డబుల్ ఎనర్జీతో నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యేవారు. స్వయంగా ఈ విషయాలను దర్శకుడు కోడి  రామకృష్ణ తెలిపిన సందర్భాలున్నాయి. అప్పట్లో సినిమా తర్వాత సినిమా చేయడం అంటే అదో ఆనందం. అలాగే వరుసగా 200 రోజులకు పైగా ఆడిన సినిమాలను తీసిన దర్శకులున్నారు. ఈ దర్శకులకు తగ్గట్టు హీరోలు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. అందుకే ఏడాదిలో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు 10 సినిమాలను రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. ఇలా చేశారు కాబట్టే 10 ఏళ్ళకు యావరేజ్‌గా 100 సినిమాలను చేసిన హీరోగా సూపర్ స్టార్ కృష్ణ నిలిచారు.

Tollywood : ఒక్క సినిమాతో హిట్ కొడితే రెండవ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న యంగ్ డైరెక్టర్..

అయితే ఇప్పటి దర్శకులలో కొందరు ఓ సినిమా భారీ హిట్ కొడితే మళ్ళీ సినిమా రావడానికి మూడేళ్ళైనా పడుతంది. ఒక సినిమా కథ రాసుకొని దాన్ని హీరోకు – నిర్మాతలకు చెప్పి ఒప్పించడానికే కొన్ని నెలలు పడుతోంది. అంతేకాదు ఇప్పటి దర్శకులు కొందరు సక్సెస్ కొట్టాలనే మైండ్ సెట్‌తో సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాల కారణంగా ఆ అంచనాలను ఎలా అందుకోవాలా అని తెగ టెన్షన్ పడుతున్నారు. అందుకు కారణం ఓ సినిమా ఫ్లాపయితే మళ్ళీ సినిమా ఇచ్చే నిర్మాతలు ఉండటం లేదు.

Tollywood : ఒక్క సినిమాతో హిట్ కొడితే రెండవ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న యంగ్ డైరెక్టర్..

ఇక హీరోలు అంత త్వరగా ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి అవకాశం ఇవ్వడం లేదు. దానివల్ల యంగ్ దర్శకులు కథ, కథనం తయారు చేసుకునేందుకే నెలలకు నెలలు సమయం తీసుకున్నా దర్శకుడిగా అవకాశం వచ్చి ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కి పూర్తై థియేటర్స్‌లో బొమ్మ పడే సరికి కనీసం ఏడాదికి పైగానే పట్టేస్తుంది. అందుకే ఒక్కో హీరో నుంచి సినిమా రావడానికి కనీసం ఏడాదికి పైగానే టైం తీసుకుంటున్నారు. ఇలా టెన్షన్ పడటం వల్లే కొందరు యంగ్ డైరెక్టర్స్ రెండు మూడు సినిమాల తర్వాత బాగా స్లో అయిపోతున్నారు.